మ్యాఢిల్లీ: విదేశాలకు భారీగా నిధులను అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంపై ఆదాయపు పన్ను టీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అనుమానాస్పదంగా నిధులను బదిలీ చేసిన 194 సంస్థలపై విచారణ చేప ట్టింది. ఈ నెల 18 నుంచి దర్యాప్తు జరుగుతోంది. ఈ సంస్థల్లో ఎక్కువ దొụకంపెనీలు ఉన్నట్టు గుర్తించారు.
ఈ నిధుల అసలు ఎక్కడి నుంచి వచ్చాయి" ఎక్కడికి చేరుతున్నాయి? విదేశీ బదిలీల వెనుక ఉన్న అసలైన లబ్దిదారులు ఎవరు? అనేది కనిపెట్టిందుకు దర్యాప్తు జరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం సెప్టెం బర్ క్వార్టర్లో మొత్తం 6,422 సంస్థలు మొత్తం రూ. 1.29 లక్షల కోట్లను విదేశాలకు పంపగా, ఈ మొత్తం తరలింపుల్లో 72.3 శాతం కేవలం సింగపూర్, యూఏఈ, హాంకాంగ్, మారిషస్, చైనాకే వెళ్లాయి.
సింగపూర్కు ఇత్యధికంగా రూ.41,885 కోట్లు, యూపిఈకి రూ.18.331 కోట్లు, హాంకాంగురూ 18,064 కోట్లు తరలించారు. విదేశీ చిరునామాలు ఉన్న 33 సంస్థలు మరో రూ.36,175 కోట్లను సంపాయి. 2025-26 లోని మొదటి ఆరు నెలల్లో రూ. 41,048 కోట్లు విదేశాలకు వెళ్లాయి.
అది అంతకు. ముందు ఆర్థిక సంవత్సరం మొత్తంలో దాదాపు 78. శాతానికి సమానం. దీంతో అనుమానం వచ్చి దొల్ల కంపెనీలు, ట్యాక్స్ ఎగవేతలను గుర్తించేందుకు దేశ వ్యాప్తంగా ప్రభుత్వం సోదాలు నిర్వహిస్తోంది. గత మూడేళ్లలో ఎలాంటి వ్యాపార టర్నోవర్ లేకపోయినా వేలకోట్లరూపాయలను పంపిన ఈ కొల్ల కంపెనీలను నిఘా వర్గాలు గుర్తించాయి. నకిలీ చారిటబుల్ ట్రస్టు లపై జరిపిన సోదాల ఆధారంగా ఈ అంతర్జాతీయ హవాలా నెట్ వర్క్ ను బజీ శాఖ ఛేదించింది.
