బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రాబడి 18 శాతం

బజాజ్  ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రాబడి 18 శాతం

ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకున్న బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తోందని కంపెనీ తెలిపింది. డైరెక్ట్ ప్లాన్-గ్రోత్ ఆప్షన్ ప్రారంభం నుంచి 18.21 శాతం వార్షిక రాబడిని అందించింది. బీఎస్ఈ –500 టీఆర్ఐ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ రాబడి 12.74 శాతం మాత్రమే ఉంది. ఫండ్ ఆస్తుల విలువ జులై చివరి నాటికి రూ.8,149.81 కోట్లకు చేరింది. మూడు లక్షలకు పైగా ఇన్వెస్టర్ ఫోలియోలు ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.  

గత నెల ఆరు వేల ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 

 హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గత నెల 6,166 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయని రియల్​ఎస్టేట్​కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దీని రిపోర్ట్​ ప్రకారం.. వీటి మొత్తం విలువ రూ.4,447 కోట్లు. గత జులైతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక శాతం, విలువ ఏడు శాతం పెరిగింది. ఈసారి రిజిస్ట్రేషన్లలో రూ. కోటికి పైగా విలువైన ఇండ్ల వాటా 20 శాతం ఉంది.  ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు మొత్తం 44,158 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి.  

బాగెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెస్ట్​కు ఎంపికైన బ్రిగేడ్  

హైదరాబాద్​కు చెందిన క్విక్ ​సర్వీస్​రెస్టారెంట్​ స్టార్టప్ బాగెల్ బ్రిగేడ్ న్యూయార్క్ బాగెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెస్ట్ 2026 పోటీకి ఎంపికైంది.  దేశవిదేశాల నుంచి వచ్చిన దరఖాస్తులలో తొమ్మిది శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ తామేనని తెలిపింది. ఈ ఏడాది నవంబర్​లో న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ మెగా షో జరుగుతుందని బాగెల్ తెలిపింది.