భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు. బుధవారం చుంచుపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటివరకు 37 శాతం లోటు వర్షపాతం నమోదైందని కలెక్టర్ తెలిపారు. చుంచుపల్లి రైతు వేదికలో దేశీ శిక్షణ పూర్తి చేసుకున్న ఇన్‌పుట్ డీలర్లకు డిప్లొమా సర్టిఫికెట్లు అందజేశారు. రైతులకు వ్యవసాయ సాంకేతిక సమాచారం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని 2,300 చెరువుల్లో 35 శాతానికి మించి నీటి నిల్వలు లేవని తెలిపారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
