కాంగ్రెస్ పాలనలో సమన్వయ లోపం..సీఎం రేవంత్‌‌రెడ్డి పాలన తీరు బాగుంది

కాంగ్రెస్ పాలనలో సమన్వయ లోపం..సీఎం రేవంత్‌‌రెడ్డి పాలన తీరు బాగుంది
  •     కూనంనేని సాంబశివరావు

ఖమ్మం టౌన్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సమన్వయం లోపించిందని, ఇది ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్‌‌రెడ్డి పాలన తీరు బాగున్నప్పటికీ.. అనేక అంశాల్లో ప్రాధాన్యతల ఎంపికలో పొరపాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో నిర్వహించిన ‘మీట్‌‌ ది ప్రెస్‌‌’లో కూనంనేని మాట్లాడారు. యువతను మోదీ ప్రభుత్వం ‘అర్బన్‌‌ నక్సల్స్‌‌’ పేరుతో అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జ్ఞానేశ్‌‌ కుమార్‌‌ పదవి నుంచి దిగిపోవాల్సిందేనని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు.