ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం..అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మాణం

ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం..అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మాణం
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి

ఖమ్మం టౌన్‌‌, వెలుగు: ఖమ్మం నగరంలోని అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం అల్లీపురం వద్ద ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సుడా చైర్మన్‌‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌‌, అడిషనల్​ కలెక్టర్‌‌ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం మున్సిపల్‌‌ కమిషనర్‌‌ అభిషేక్‌‌ అగస్త్యతో కలిసి తుమ్మల పరిశీలించారు.

 ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి కేటాయించిన భూమి విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. భూసేకరణను  విజయవంతంగా పూర్తి చేసిన అడిషనల్​ కలెక్టర్‌‌ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ఈ నెల 12న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.