మానవత్వం చాటిన అశ్వారావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

మానవత్వం చాటిన అశ్వారావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

దమ్మపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్​ పిట్టల రాజు బైక్​పై వెళ్తుండగా సరోజినాపురం వద్ద స్కిడ్​అయి పడిపోయాడు. ఇదే సమయంలో సత్తుపల్లి నుంచి గడుగులపల్లికి వెళ్తున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రమాదాన్ని చూసి వాహనాన్ని నిలిపారు. 

వెంటనే క్షతగాత్రుడిని తన వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించే వరకు దగ్గరుండి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించి ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్నారు.