- కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవుడి కాలం నాటిదిగా గుర్తింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ మండలం దుండిగల్‌లో 11వ శతాబ్దం నాటి జైన శాసనం బయటపడింది. దుండిగల్‌లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ శాసనాన్ని నర్సన్నగారి జగన్ గుర్తించారు. ఈ విషయాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు హరగోపాల్‌కు తెలియజేశారు.
ఈ స్తంభం గతంలో దిండిలోని చిన్న చెరువు దగ్గర ఉండేదని ఆలయ పూజారి తెలిపారు. అక్కడి నుంచి దాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం శాసన స్తంభం మధ్యలో విరిగిపోయి ఉంది. స్తంభానికి మూడు వైపులా 11వ శతాబ్దానికి చెందిన తెలుగు-, కన్నడ లిపిలో 41 పంక్తులు చెక్కి ఉన్నాయి. శాసనంపై చంద్రుడు, సూర్యుడు, జైన తీర్థంకరుడు, ఆవు-దూడల చిత్రాలు చెక్కారు. కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవుడి కాలానిదిగా గుర్తించారు.
