కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ పద్ధతిలో 6 కొత్త పీజీ కోర్సులు మంజూరయ్యాయి. విద్యార్థుల భవిష్యత్, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీసీ ఉమేశ్ కుమార్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కమిషనర్ ఎ.శ్రీదేవసేన ఆమోదం తెలిపారు. దీంతో యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభం కాబోతున్నాయి.
యూనివర్సిటీ క్యాంపస్ లోని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ(రిటైల్ మేనేజ్మెంట్ -60 సీట్లు), ఎంకామ్(ఫైనాన్స్ టెక్నాలజీ -40 సీట్లు) కోర్సులు, యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ(ఫోరెన్సిక్ సైన్స్ -30 సీట్లు), ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్(30 సీట్లు), యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్‌లో ఎంఎస్ డబ్ల్యూ(మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ -40 సీట్లు) కోర్సులు మంజూరయ్యాయి. గోదావరిఖని పీజీ కాలేజీలో ఎంబీఏ(బిజినెస్ అనలిటిక్స్ 60 సీట్లు) మంజూరైంది. ఈ కోర్సుల్లో 2026–27 అకడమిక్ ఇయర్ నుంచే అడ్మిషన్లు ప్రారంభించనున్నారు.
