బుధవారం తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్లు ఊహించని షాక్ ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాసం షాపర్లకు షాక్ తగిలింది. అనూహ్యంగా గోల్డ్ రేటు గ్రాముకు రూ.16వేలకు చేరుకోవటంతో మళ్లీ రేట్లు ఆల్ టైం గరిష్టాలను తాకుతాయనే భయాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. అయితే ఈ రేట్ల ర్యాలీ ఇంకా కొనసాగుతుందా అనే భయంతో కొనాలనుకునేవారు ముందుగా తమ సమీప నగరాల్లో మారిన ధరలను పరిశీలించటం బెటర్. బంగారానికి డిమాండ్ పెరగటంతో పాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆందోళనలు ఈ పరిస్థితులకు కారణంగా చెబుతున్నారు నిపుణులు.
ఆగస్టు 20న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.430 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 927గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 600గా కొనసాగుతోంది.
ALSO READ : బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రాబడి 18 శాతం
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 20, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.10వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
