ఇరుముడి లాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఛాలెంజింగ్

ఇరుముడి లాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఛాలెంజింగ్

నెలను రెండు భాగాలుగా విభజించి 15 రోజులు షూటింగ్‌‌కు, మరో 15 రోజులు మ్యూజిక్‌‌ కంపోజింగ్‌‌కు కేటాయిస్తూ నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా కెరీర్‌‌‌‌ను బ్యాలెన్స్‌‌ చేస్తున్నా అంటున్నాడు జీవీ ప్రకాష్​ కుమార్. తను సంగీతం అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’.  

రవితేజ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌‌లో మైత్రి సంస్థ నిర్మించిన ఈ చిత్రం  ఆగస్టు 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్‌‌ మాట్లాడుతూ ‘‘ఇదొక ఇంటెన్స్ థ్రిల్లర్. చాలా కొత్తగా ఉంటుంది. ట్విస్ట్‌‌లు ప్రేక్షకులు ఊహించలేరు. పాత్రలు మారే విధానం, సంఘటనలు, సన్నివేశాలు ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇంటెన్స్ సైకలాజికల్ థింకింగ్‌‌తో అప్రోచ్ అయ్యాను.

ఇందులో భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ లాంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మ్యూజికల్‌‌గా బ్యాలెన్స్ చేశా. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఛాలెంజింగ్. ఇక పాటల్లో ‘మల్లెపూల పల్లకి’ ఒక ఐకానిక్ సాంగ్. అందుకే ఒరిజినల్ సింగర్‌‌తోనే పాడించాం.

ఇప్పుడది టాప్ ట్రెండింగ్‌‌లో ఉంది. నాకు ‘యాలాలో’ పాట చాలా ఇష్టం. క్లైమాక్స్‌‌కి చాలా కీలకంగా ఉండే ఈ ఎమోషనల్‌‌ సాంగ్‌‌ రవితేజ గారికి చాలా ఇష్టం. బెస్ట్ రీజినల్ ఫిలిం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ లాంటి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయని,  కమర్షియల్‌‌గానూ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అని చెప్పాడు.