మహాకాళి గ్లింప్స్‌‌‌‌ వస్తోంది

మహాకాళి  గ్లింప్స్‌‌‌‌  వస్తోంది

‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో మైథలాజికల్ సూపర్ హీరో జానర్‌‌‌‌‌‌‌‌ మూవీ ‘మహాకాళి’. భూమి శెట్టి మహాకాళిగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తోంది.  

ప్రశాంత్ వర్మ షోరన్నర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.  ఆర్‌‌‌‌కే దుగ్గల్ సమర్పణలో రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తున్నారు.  ‘ది ఎండ్ బిగిన్స్’ అనే ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌తో వస్తున్న ఈ సినిమాకు బుధవారం అప్‌‌‌‌డేట్‌‌‌‌ ఇచ్చారు.  ఆగస్టు 24న ఫ‌‌‌‌స్ట్ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రంలో ఇంకా శ్రీయారెడ్డి, రోహిత్ సరాఫ్, ఖుష్బూ సుందర్, రాజేష్ బేడి, పోసాని మురళీ శర్మ, నాజర్, రజత్ కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  స్మరణ్ సాయి సంగీతం సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.