ట్రెండ్కు తగ్గ సినిమా మోడ్రన్ మిస్సమ్మ

ట్రెండ్కు తగ్గ  సినిమా మోడ్రన్ మిస్సమ్మ

హర్ష నర్రా, తన్మయి  ఖుషి జంటగా సాయిబాబా దర్శకత్వంలో చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి,  స్రవంతి నంబూరి నిర్మిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్సమ్మ’.  ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌‌‌ను ప్రసాద్‌‌‌‌ ల్యాబ్స్‌‌‌‌లో లాంచ్ చేశారు. గోపీ సుందర్  కంపోజ్ చేసిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ సాహిత్యం అందించారు.

సాంగ్‌‌‌‌ లాంచ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో డైరెక్టర్ సాయి బాబా మాట్లాడుతూ ‘కంటెంట్‌‌‌‌పై నమ్మకంతో మిస్సమ్మ లాంటి క్లాసిక్​ టైటిల్ పెట్టాం.  పెళ్లి చేసుకోవాలంటే ఏం  కావాలో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని చెప్పారు. హీరో హర్ష నర్రా మాట్లాడుతూ ‘మిస్సింగ్, రోటి కపడా రొమాన్స్ చిత్రాల తర్వాత నేను నటించిన మూడో చిత్రమిది.  

అందరూ రిలేట్  చేసుకునేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. దర్శకుడు అమ్మాయిల పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఈ కథను రాయడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్‌‌‌‌ తన్మయి చెప్పింది.  ‘కాలింగ్ సహస్ర’  తర్వాత నేను నిర్మించిన రెండో సినిమా ఇది.  ప్రస్తుత ట్రెండ్‌‌‌‌కు తగ్గట్టుగా తీసిన సినిమా ఇది’ అని నిర్మాత చిరంజీవి పమిడి చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.