కృష్ణానగర్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అరెస్ట్ వారెంట్‌ను వెంటనే అమలు చేసి ఈ నెల 28లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మహువా మొయిత్రా హాజరుకావాల్సి ఉండగా ఆమె గైర్హాజరయ్యారు. కోర్టు ప్రాంగణం బయట తనను కొందరు అడ్డుకుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్న భయంతో ఆమె రాలేకపోతున్నారని ఆమె న్యాయవాది తెలిపారు.
