త్వరలో యశ్ సినిమా ‘టాక్సిక్’తో ప్రేక్షకులను పలకరించబోతోంది కియారా అద్వాని. ఇందులో ఆమె నాదియా అనే పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మరో సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రచయితగా, నిర్మాతగా తనదైన మార్క్ చూపించిన కనికా థిల్లాన్ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇందులో సైప్ అలీఖాన్ హీరోగా నటించనుండగా తనకు జంటగా కియారా అద్వాని నటించబోతోందని సమాచారం. ఈ ఇద్దరు కలిసి నటించబోతున్న తొలిచిత్రం ఇది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్‌ను కనికా థిల్లాన్ 2013లో పెళ్లి చేసుకోగా, 2017లో వీళ్లిద్దరూ విడిపోయారు.
తెలుగులో అనుష్క హీరోయిన్‌గా వచ్చిన ‘సైజ్ జీరో’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించిన కనిక.. హిందీలో మన్మర్జియాన్, కేదార్‌నాథ్, జడ్జ్‌మెంటల్ హై క్యా, హసినా దిల్‌రుబా, రష్మి రాకెట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. అలాగే ఏక్ విలన్ రిటర్స్న్, రక్షా బంధన్, డుంకీ, ఫిర్ ఆయి హసీనా దిల్ రుబా చిత్రాలకు కథను అందించారు.
