హైదరాబాద్, వెలుగు: దేశంలోనే క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి టాప్‌లో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చదువులో టాప్ లేకున్నా కనీసం కేసుల్లోనైనా టాప్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఐఏఎస్, ఐపీఎస్‌లు రాజకీయ నాయకుల వలలో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన 25 రోజులు ఉండాల్సిందని, కానీ మాన్‌సూన్ సెషన్స్ ఉన్నాయని కుదించినట్లు చెబుతున్నారన్నారు. భారత వ్యతిరేక శక్తుల మీటింగ్‌కు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఏజెండాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
