వరలక్ష్మి వ్రతం రేపే ( ఆగస్టు 21)..పూజా సమయం..శుభముహూర్తం ఇదే..!

వరలక్ష్మి వ్రతం రేపే ( ఆగస్టు 21)..పూజా సమయం..శుభముహూర్తం ఇదే..!

శ్రావణమాసం కొనసాగుతుంది.  వరలక్ష్మి వ్రతం... శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు అనగా రెండో శుక్రవారం చాలా విశిష్టమైనది.  ఈ ఏడాది ఆగస్టు 21 వతేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఆరోజు హిందువులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తిగా జరుపుకుంటారు.  వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి.. శుభముహూర్త సమయం.. మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం.. .

అష్టలక్ష్ముల్లో వరాలిచ్చే తల్లి వరలక్ష్మీని శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది వరలక్ష్మీ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఏ పూజ చేసినా.. ఏ నోము నోచినా ..ఏ వ్రతమైనా సరే సరైన శుభముహూర్తంలో ఆచరిస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.   వరలక్ష్మీ వ్రతం రోజున( ఆగస్టు 21)  స్థిర లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, కుంభ లగ్నం , వృషభ లగ్న సమయాలు పూజకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆయా ప్రాంతాలలోని స్థానిక పంచాగం ప్రకారం సరిగ్గా ముహూర్తం చూసుకుని కలశ స్థాపన చేయడం వల్ల అష్టలక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

వరలక్ష్మి వ్రతం పూజకు శుభముహూర్త సమయాలు ఇవే..!

  •  సింహలగ్న పూజ ముహూర్తం (ఉదయం) – 06:10 am – 08:28 am (వ్యవధి – 2 గంటల 18 నిమిషాలు)
  • వృశ్చిక రాశి పూజ ముహూర్తం (మధ్యాహ్నం) – 12:40 PM – 02:58 PM (వ్యవధి – 2 గంటల 18 నిమిషాలు)
  • కుంభ లగ్న పూజ  ప్రదోష కాల ముహూర్తం (సాయంత్రం) – 06:20 PM – 07:58 PM (వ్యవధి – 1 గంట 38 నిమిషాలు)

పూజ చేయకూడని  ముహూర్తాలు

  • వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి) – 11:20 pm – 01:15 am వరకు  ఈ సమయంలో పూజలు చేయరాదు.
  • రాహుకాలం :  ఆగస్టు 21 ఉదయం 10:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:19 గంటల వరకు
  • యమ గండం : 21 ఆగస్టు 2026 శుక్రవారం మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

వరలక్ష్మీ వ్రతం రోజున స్థింహ లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది. భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మీ వ్రతం దీపావళి పూజతో సమానమైన ఫలితాలను ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకా చారుమతి కథను చదవడం, కనకధారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.