హైదరాబాద్ సిటీలో మరో ఫ్లైఓవర్ సిద్ధం కానుంది. సాగర్ రోడ్డు నుంచి బీఎన్ రెడ్డి వరకు కొత్త ఫ్లైఓవర్ కు లైన్ క్లియర్ అయ్యింది. 3.2 కిలోమీటర్ల పొడవు, 6 లేన్లలో నిర్మించనున్న ఫ్లైఓవర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
సాగర్ రోడ్డు నుంచి బీఎన్ రెడ్డి వరకు ఉండే ఈ ఫ్లైఓవర్ హస్తినాపురం మీదుగా వెళ్లనుంది. ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్ కారిడార్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే సిగ్నల్ దగ్గర ఎదురు చూపులు, దూరభారాలు తగ్గనున్నాయి.
ఎల్బీనగర్–హస్తినాపురం–బీఎన్ రెడ్డి రూట్ హైదరాబాద్ ఈస్ట్ లో బిజీ రూట్లలో ఇదొకటి. ఇన్నర్ రింగ్ రోడ్డు, విజయవాడ నేషనల్ హైవే కలిసే ప్రాంతంలో భారీ ట్రాపిక్ ఏర్పడుతుంటుంది.
మీర్ పేట్, బడంగ్ పేట్, వనస్థలీపురం, ఎల్బీ నగర్ర రూట్లలో వచ్చే వారు ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతుంటారు. ఉదయం, సాయంత్రం అరగంట నుంచి 45 నిమిషాల వరకు సాగర్ రింగ్ రోడ్డు దగ్గర ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అందుకే ఈ రూట్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఎప్పటి నుంచో వాహనదారుల నుంచి డిమాండ్ ఉంది.
ఈ రూట్ క్లియర్ అయితే సిగ్నల్స్ అవసరం లేకుండా బైపాస్ మీదుగా వాహనదారులు ఎల్బీ నగర్ మీదుగా బీఎన్ రెడ్డి వెళ్లవచ్చు. అదే విధంగా నాగార్జున సాగర్ హైవే, విజయవాడ హైవే లో ఎలాంటి జామ్ లేకుండా వెళ్లవచ్చు. అంబులెన్స్ లు, బస్సులకు క్లియర్ చానెల్ దొరకడంతో.. ఇబ్బందులు ఉండవు. అదే విధంగా ట్రాఫిక్ తగ్గటం, దూరం తగ్గటంతో ఫుయెల్ వినియోగం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
సాగర్ రోడ్ – బీఎన్ రెడ్డి కారిడార్ తో స్థానికంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందటంతో పాటు కమర్షియల్ గా, వ్యాపార అవకాశాలు పెరగుతాయని భావిస్తున్నారు.
