మంత్రి కొండా సురేఖ సారీ చెప్పాలి: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

మంత్రి కొండా సురేఖ సారీ చెప్పాలి: ప్రభుత్వ  విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్ :  సీఎం రేవంత్ రెడ్డిపై  మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖపై తీవ్ర విమర్శలు చేశారు.  కొండా సుష్మిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సుష్మిత కామెంట్లపై మంత్రి కొండా సురేఖ ఖండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి,  ప్రభుత్వానికి కొండా సురేఖ సారీ చెప్పాలని  డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ సీఎంపై విమర్శలుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  

పదేళ్ల పాలనలో రాష్ట్రానికి బీఆర్ ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు బీర్ల ఐలయ్య..  పేదలకోసం కష్టపడుతున్న సీఎంను విమర్శించడం సరికాదన్నారు.  ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ను బీజేపీ, బీఆర్ ఎస్ లే అడ్డుకున్నాయని ఆరోపించారు బీర్ల ఐలయ్య.