బంగాళాఖాతంలో అల్పపీడనం..నేటి (ఆగస్టు 21) నుంచి 28 వరకు మళ్లీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం..నేటి (ఆగస్టు 21)  నుంచి 28 వరకు మళ్లీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పది రోజులుగా విరామం ఇచ్చిన వర్షాలు అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 28 వరకు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో వర్షపాత లోటు 13 శాతానికి పెరిగింది.