హైదరాబాద్, వెలుగు: ఎల్జీ ఎక్విప్‌మెంట్స్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీల కోసం కంప్రెసర్ బ్రాండ్ వేయూను ఆవిష్కరించింది. ఈ మేడ్ ఇన్ ఇండియా కంప్రెసర్లను హైదరాబాద్లో గురువారం విడుదల చేసింది. ఎంఎస్ఎంఈల అవసరాలకు తగినట్లుగా 5 నుంచి 45 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కంప్రెసర్లను ప్రవేశపెట్టింది.
స్థిరమైన, వేరియబుల్ స్పీడ్ ఆప్షన్లతో పాటు 7 నుంచి 12.5 బార్ పీడన సామర్థ్యంతో ఈ ఉత్పత్తులను రూపొందించారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాలకు ఇవి ఉపయోగపడతాయి. వేయూ బ్రాండ్ కంప్రెసర్లకు దేశవ్యాప్త సర్వీస్ సపోర్ట్, వారంటీ లభిస్తాయని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అన్వర్ జయ వరదరాజ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరిస్తామని ప్రకటించారు.
