10 ఏళ్ల తర్వాత చక్కెర దిగుమతులపై సుంకం రద్దు.. పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకే

10 ఏళ్ల తర్వాత చక్కెర దిగుమతులపై సుంకం రద్దు.. పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకే

న్యూఢిల్లీ: చక్కెర ధరలు విపరీతంగా పెరగడంతో   కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పదేళ్ల తర్వాత మొదటిసారిగా చక్కెర దిగుమతులపై సుంకాలను రద్దు చేసింది.   10 లక్షల మెట్రిక్ టన్నుల (10 లక్షల టన్నులు) ముడి చక్కెరను సుంకం లేకుండా (డ్యూటీ-ఫ్రీ) దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

 దేశీయంగా  ఉత్పత్తి తగ్గడంతో సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. గత రెండు నెలల్లోనే దేశంలో చక్కెర ధరలు ఏకంగా 40 శాతం మేర పెరిగాయి. దీంతో దాదాపు పదేళ్ల తర్వాత భారత్ మళ్లీ చక్కెర దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది.  పండుగ సీజన్ రానుండడంతో  స్వీట్లు, కేకుల తయారీకి డిమాండ్ భారీగా పెరగనుంది.  

దీనిని దృష్టిలో ఉంచుకుని కొరత రాకుండా ఉండేందుకు తాజా నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ రేట్ కోటా కింద 10 లక్షల టన్నుల వరకు సున్నా శాతం కస్టమ్స్ డ్యూటీతో అక్టోబర్ 31, 2026 వరకు దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది.  అంతేకాకుండా  అక్రమ నిల్వలు, స్పెక్యులేషన్‌‌‌‌ను  అడ్డుకునేందుకు ఇప్పటికే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర డీలర్లపై ప్రభుత్వం స్టాక్ లిమిట్స్‌‌‌‌ను కేంద్రం విధించింది.