హైదరాబాద్, వెలుగు: నానో-క్యారియర్ ఎంట్రాప్డ్ విటమిన్ డి3 మందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి ఆమోదం వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన పల్స్ ఫార్మా తెలిపింది. నోటితో తీసుకునే విటమిన్‌డీ3 ఓరల్సస్పెన్షన్ మరింత సమర్థంగా పనిచేసేందుకు విప్లవాత్మక నానోపార్టికల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ కేవీ రాంబాబు తెలిపారు.
సంప్రదాయ ఫార్ములాలతో పోలిస్తే ఈ కొత్త విధానంలో శరీరానికి 60 శాతం ఎక్కువ సీరమ్ విటమిన్ డీ అందుతుందని చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీకి యూఎస్ఎఫ్డీఏ ఆమోదం కూడా పొందడానికి సంస్థ ప్రయత్నిస్తోంది.
ఈయూ పేటెంట్ తుది దశలో ఉందని, ఇతర ప్రొప్రైటరీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం పేటెంట్లు దాఖలు చేశామని, ఇతర మందుల కోసం కూడా నానో పార్టికల్ టెక్నాలజీ వాడతామని రాంబాబు పేర్కొన్నారు.
