రాయదుర్గం భూముల వేలంపై స్టేకు హైకోర్టు నో.. కైంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, HMDAకు ఆదేశం

రాయదుర్గం భూముల వేలంపై స్టేకు హైకోర్టు నో.. కైంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం,  HMDAకు ఆదేశం
  • ప్రభుత్వం, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తలోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 83/1లో ప్లాట్ల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చారిత్రక నిర్మాణాలు, రాళ్లు ఉన్న ప్రాంతంలో జోక్యం చేసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో వేలంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19కి వాయిదా వేసింది.

మరో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ స్టేకు నో..

సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 83/1లోని 11 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయని, వేలాన్ని నిలిపివేయాలని రమాదేవి, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తమ పట్టా భూముల్లో అధికారులు జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్లు ఆరోపించారు. జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి. శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ చేపట్టారు. భూసంస్కరణల ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసినట్లు ఆధారాలు లేనందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు.