‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిన త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం గౌరవంగా భావిస్తున్నా. దాన్ని నిలబెట్టుకోవడం కోసం బాధ్యతగా పనిచేస్తా’’ అని చెప్పాడు దర్శకుడు వెంకీ అట్లూరి. సూర్య హీరోగా సితార బ్యానర్‌లో నాగవంశీ నిర్మాతగా వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి ఇలా ముచ్చటించారు.
‘‘మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం హ్యాపీ. సూర్య గారు ఓ ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ స్టోరీ వినిపించా. ఆయనకు నచ్చింది. అయితే అనవసరమైన కామెడీ జోడించకుండా నిజాయితీగా కథ చెబుదాం అన్నారు. అందుకే ఏ క్యారెక్టర్ డ్రాప్ అవకుండా కేర్ తీసుకున్నాం. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. నిజానికి 2022లో ఈ కథ రాశా. సూర్య గారికి నచ్చాక ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు మార్పులు చేశాం. ఏజ్ గ్యాప్ రిలేషన్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. మనుషులు చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారనేది ఇందులో చెప్పాం.
‘ప్రేమలు’ చూసి మమితా బైజును ఎంపిక చేశాం. కామెడీ చేయాలంటే భాషపై పట్టుండాలి. ఆమెకు తమిళంపై పట్టు ఉండడం ప్లస్ అయింది. సూర్య గారి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని తమిళంలో తీశాం. మనతో పోల్చితే తమిళనాడులో థియేటర్స్ సంఖ్య, టెకెట్ రేట్లు తక్కువ ఉండడంతో వసూళ్లు తమిళంలో తక్కువ అనిపిస్తున్నాయి. కానీ అక్కడ లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది. ఇక డబ్బు, అగ్రిమెంట్‌లకు అతీతమైన బంధం నాకు సితార బ్యానర్‌తో ఉంది. నన్ను నమ్మి అవకాశమిచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు.
వెంకీ అట్లూరి హ్యాట్రిక్ సక్సెస్!
డైరెక్టర్ వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో వరుస విజయాలను అందుకుంటున్నారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘సార్’ (వాతి) 2023లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ‘లక్కీ భాస్కర్’ 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా కథ, దుల్కర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
తాజాగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. విడుదలైన మొదటి వారంలోనే మంచి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఇలా ‘సార్’, ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి వరుస విజయాలను అందుకున్నారు. దీంతో వెంకీ అట్లూరి–సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ హ్యాట్రిక్ సక్సెస్ కాంబినేషన్‌గా నిలిచింది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆగష్టు 14న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్లుకి పైగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ (ఆగస్టు 21న) 8వ రోజు అడుగుపెట్టిన ఈ సినిమా.. ఇప్పటివరకు ఇండియా నెట్ వసూళ్లు రూ.81.63 కోట్లు సాధించింది. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ.94.36 కోట్లతో దూసుకెళ్తుందని సినీ వర్గాలు వెల్లడించాయి. మొదటి మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. వీక్ డేస్‌లోనూ మంచి హోల్డ్‌ను కొనసాగించింది.
That's Sanjay Vishwanath & His Glory ❤️🔥❤️🔥
— Sithara Entertainments (@SitharaEnts) August 18, 2026
AIMED & HIT the bullseye with 150Cr+ Worldwide Gross in just 4 days 💥💥#VishwanathAndSons#BlockbusterVAS #BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84… pic.twitter.com/gtRc20M1AL
