ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ర్యాలీలు

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ర్యాలీలు

చొప్పదండి/మంథని/నస్పూర్/ కోల్​బెల్ట్/​జన్నారం రూరల్, వెలుగు: నల్గొండ జిల్లాలో ప్రైవేట్​ స్కూల్​కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ప్రైవేట్​స్కూళ్ల యాజమాన్యాలు, కరస్పాంటెంట్లు, టీచర్లు తీవ్రంగా ఖండించారు. రూపారెడ్డి హత్యకు నిరసనగా చొప్పదండి ట్రస్మా ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెంట్లు, టీచర్లు అంబేద్కర్ విగ్రహం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం దృష్టిసారించి టీచర్లకు తగిన రక్షణ కల్పించాలని ట్రస్మా అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాకతీయ స్కూల్ టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని, వారు చెడు మార్గంలో నడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి సూచించారు.

బంద్​ను సక్సెస్​ చేయాలి

ప్రిన్సిపాల్​దారుణ హత్య ఘటనపై మంచిర్యాల జిల్లా ట్రస్మా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులపైనే విద్యార్థులు దాడులకు పాల్పడటం అత్యంత బాధాకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే స్కూళ్ల బంద్​ను విజయవంతం చేయాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. జన్నారం మండల కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్​ స్కూళ్ల హెచ్​ఎంలు, టీచర్లు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రూపా రెడ్డి ఫొటోకు నివాళులర్పించారు. మందమర్రిలోని మార్కెట్​లో ట్రస్మా ఆధ్వర్యంలో టీచర్లు కొవ్వొత్తులతో శాంతిర్యాలీ నిర్వహించారు.