గడచిన వారం రోజుల్లో ఒక్క రోజు మినహా ప్రతిరోజూ బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు మరోపక్క వెండి కూడా తన స్తబ్ధత నుంచి బటకు వచ్చి భారీగా పెరుగుతోంది. తెలుగు ప్రజలు ఎక్కువగా జరుపుకునే శ్రావణమాసం అందులోనూ శుక్రవారం రోజున బంగారం రేట్లు మళ్లీ గరిష్టాల దిశగా పరిగెత్తుతుండటం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వాళ్లు ముందుగా తమ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.
ఆగస్టు 21న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 20 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.121 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 048గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 710గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 21, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి రూ.2లక్షల 65వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.265 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
