హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి.. మా మేన మామ అని గతంలో కొండా సుస్మిత చెప్పి.. ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. గురువారం గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కాల్వ సుజాత, ఇందిరాశోభన్, గుంజా రేణుక మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎంను ఏకవచనంతో విమర్శించమేంటని, ఆమె స్థాయి, వయస్సు ఏంటో ముందు తెలు సుకోవాలని సూచించారు. అసలు ఆమె ఎప్పుడైనా గాంధీ భవన్ మెట్లు ఎక్కారా? అని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యల వల్ల ఆమె తల్లిదండ్రులు క్షమాపణలు కోరే పరిస్థితి ఏర్పడిందని, సొంత కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఇలాంటి వారు జనంలో లీడర్ కాలేరని మండిపడ్డారు.
