ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ

ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ

నెట్​వర్క్, వెలుగు: దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ​జిల్లాల్లో రాజీవ్​ గాంధీ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, దేశానికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. 

ప్రధాని రాజీవ్​గాంధీ దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారని, అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.