నర్సంపేట, వెలుగు: ‘పర్మిషన్లు తీసుకొని విగ్రహం పెట్టలేకపోతే చెప్పండి.. మేమే డబ్బులు వేసుకొని నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ సవాల్ చేశారు. నర్సంపేటలోని పార్టీ ఆఫీసులో గురువారం మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది అనారోగ్యానికి గురయ్యారనే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం గ్రీన్ఛానల్ద్వారా హైదరాబాద్‌కు తరలించిందని, ఆయన చనిపోయాక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయం బీఆర్‌ఎస్ లీడర్లు మర్చిపోవద్దన్నారు.
పర్మిషన్ లేకుండా అసైన్డ్ భూమిలో హడావుడిగా విగ్రహం ఏర్పాటు చేశారని, అందుకే అధికారులు చట్టప్రకారం వ్యవహరించారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ లీడర్లు మాత్రం శవ రాజకీయాలు చేస్తూ తమ నాయకుడు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్ల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఫైర్అయ్యారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు పంబి వంశీ, లీడర్లు సాంబరెడ్డి, కర్నాటి పార్వతమ్మ, కత్తి కిరణ్, మురళీ, సందీప్, రవికుమార్ పాల్గొన్నారు.
