జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో సీలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఘటన జరిగిన సమయంలో అక్కడ నవజాత శిశువు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల వార్డులో సీలింగ్ కూలడంతో ఆసుపత్రిలో కొంతసేపు ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆసుపత్రి భవనం పైకప్పు పెచ్చులు, సీలింగ్ భాగాలు ఎక్కడికక్కడ ఊడిపడే పరిస్థితి ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని అధికారులు వెంటనే పరిశీలించి, మరిన్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
