వరంగల్ సిటీ: ప్లాస్టిక్ కంపెనీ లో అగ్నిప్రమాదం.. రూ.35 లక్షల ఆస్తి నష్టం

వరంగల్ సిటీ: ప్లాస్టిక్ కంపెనీ లో అగ్నిప్రమాదం.. రూ.35 లక్షల ఆస్తి నష్టం

వరంగల్​ సిటీ, వెలుగు: గ్రేటర్​ వరంగల్​ పరిధి ఏనుమాముల మార్కెట్​ సమీపంలోని ప్లాస్టిక్  కంపెనీలో మంటలు చెలరేగి రూ.35లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనతో సమీప ప్రజలు  భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం ప్లాస్టిక్  కంపెనీలో నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 

షార్ట్​ సర్య్కూట్ తో​ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఏనుమాముల సీఐ జవ్వాజి సురేశ్​ తెలిపారు. ప్లాస్టిక్  వస్తువులతో పాటు ఇల్లు, బొలెరో వెహికల్​ కాలిపోయింది. ఈ ప్రమాదం రాత్రి వేళలో జరిగి ఉంటే పక్కనే కోల్ట్​ స్టోరేజీ, పత్తి మిల్లులకు మంటలు వ్యాపించి ఆస్తి నష్టం పెరిగి ఉండేదని అంటున్నారు.