భిక్షాటన చేసి నారాయణపూర్ గ్రామస్తుల నిరసన...స్పృహ కోల్పోయిన ముగ్గురు మహిళలు

భిక్షాటన చేసి నారాయణపూర్ గ్రామస్తుల నిరసన...స్పృహ కోల్పోయిన ముగ్గురు మహిళలు

గంగాధర, వెలుగు: కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​ను ​ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 12వ రోజుకు చేరింది. గ్రామస్తులు గురువారం మధురానగర్ చౌరస్తాలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నారాయణపూర్ ఇచ్చిన మాట ప్రకారం ముంపు గ్రామంగా ప్రకటించి మాట నిలబెట్టుకోవాలన్నారు. 

తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో ముగ్గురు మహిళలు అనుపురం రేణుక, కె.మంజుల, రాజేశ్వరి షుగర్​ లెవల్స్​ తగ్గి స్పృహ కోల్పోయారు. స్థానికులు వారికి సమీపంలోని పీహెచ్​సీకి తరలించారు. చికిత్స పొందుతున్న మహిళలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులకు సూచించారు.