కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. రూ.7.14లక్షల ఆదాయం సమకూరిందని ఈవో సత్యనారాయణ తెలిపారు.
గతంలో కంటే ఈసారి ఆదాయం 10 శాతం పెరిగినట్లు చెప్పారు. కాగా భక్తులు నేపాల్‌కు చెందిన నాణేంతోపాటు1957 నాటి నాటి రాగి రూపాయి నాణెం అమ్మ వారికి కానుకగా వచ్చినట్లు తెలిపారు.
