స్కూల్ చూడ్డానికి వెళ్లిన కాక్రోచ్ పార్టీ వాళ్లను తరిమి తరిమి కొట్టిన బీజేపీ కార్యకర్తలు

స్కూల్ చూడ్డానికి వెళ్లిన కాక్రోచ్ పార్టీ వాళ్లను తరిమి తరిమి కొట్టిన బీజేపీ కార్యకర్తలు

Cockroach Party: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో వసతులు, చదువులపై ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి.. గ్రౌండ్ లెవల్లో ఫస్ట్ టైం టఫ్ సిట్యువేషన్ ఎదురైంది. 2026, ఆగస్ట్ 21వ తేదీ ఉదయం రాజస్థాన్ రాష్ట్రంలోని రాంపురా, కన్వర్ పురా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయటానికి కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్ల బృందం వెళ్లింది. స్కూల్ ను పరిశీలించారు. 

ఓ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరు.. అక్కడ పశువులు ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్ అంతా పశువుల పాకగా ఉంది. ఇదేమని ప్రశ్నించారు కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్లు. ఈ విషయం తెలిసిన వెంటనే.. బీజేపీ కార్యకర్తలు తండోప తండాలు వచ్చారు. మీరెవ్వరురా స్కూల్ పరిశీలించటానికి అంటూ సీజేపీ వాలంటీర్లపై దాడికి దిగారు. సీజేపీ వాలంటీర్లను బీజేపీ కార్యకర్తలు పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొట్టారు. బీజేపీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా రావటం.. దౌర్జన్యం చేయటం.. కొట్టటం జరిగిందని.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే వీడియోలతో సహా వెల్లడించారు. 

భాతరదేశం రేపటి భవిష్యత్ నేటి బాలలపైనే ఆధారపడి ఉందని.. నేటి బాలలే రేపటి పౌరులు అన్న కనీస జ్ణానం బీజేపీ వాళ్లకు లేకపోవటం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఉండాలి.. ఆ పిల్లలకు టీచర్ పాఠాలు చెప్పాలి.. అలాంటి పాఠశాల పశువుల పాక మాదిరిగా ఉండటాన్ని ప్రశ్నిస్తే.. బీజేపీ వాళ్లు ఎందుకు దాడులు చేస్తున్నారంటూ కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ తనిఖీ చేస్తున్న కాక్రోజ్ జనతా పార్టీ వాలంటీర్ల వాహనాలపైనా దాడులు చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. కొంత మంది వాలంటీర్లకు గాయాలు అయినట్లు వెల్లడించారు చీఫ్ అభిజీత్ దీప్కే.