Nani: ‘ది పారడైజ్‌’తో నాని నేర్చుకున్న పాఠం ఇదేనట.. నెక్ట్స్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Nani: ‘ది పారడైజ్‌’తో నాని నేర్చుకున్న పాఠం ఇదేనట.. నెక్ట్స్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ది పారడైజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇక ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో చేస్తుండగా.. ఆ తర్వాత మరో ఆసక్తికరమైన ప్రేమకథలో నటించనున్నట్లు నాని స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా ది పారడైజ్‌ సినిమా ప్రయాణం నుంచి ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నామని నాని తెలిపారు. ఇకపై ఒక సినిమా మేకింగ్‌కు ఎంత టైమ్ పట్టినా, షూటింగ్ కంటే ప్రి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకే 60 నుంచి 70 శాతం సమయం కేటాయించాలని డిసైడ్ అయినట్లు చెప్పడంతో వీడియో తెగ వైరల్ అవుతుంది. 

బ్లడీ రోమియో.. పూర్తిగా కొత్త స్టైల్‌లో

సాహో, ఓజీ వంటి స్టైలిష్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన సుజీత్.. నానితో చేస్తున్న బ్లడీ రోమియోను కూడా చాలా డిఫరెంట్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్, హింస ఉన్నప్పటికీ.. దాన్ని సీరియస్‌గా కాకుండా వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ మూవీ గురించి నాని మాట్లాడుతూ.. ఇది తన గత చిత్రం ది పారడైజ్ కు పూర్తి భిన్నమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు.

స్టైలిష్ విజువల్స్, యాక్షన్‌తో పాటు దర్శకుడు సుజీత్ జోడించిన ప్రత్యేకమైన ట్విస్ట్ సినిమాకు మరింత క్రేజీని తీసుకొస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ తరహా కథను ఇండియన్ స్క్రీన్ పై ఇంతకుముందు చూడని విధంగా తెరకెక్కిస్తున్నారని నాని చెప్పడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

యాక్షన్ తర్వాత స్వీట్ లవ్‌స్టోరీ..

బ్లడీ రోమియో పూర్తయిన తర్వాత నాని మరో కొత్త జానర్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈసారి ఓ అందమైన ప్రేమకథలో కనిపించబోతున్నారు. అయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ లవ్‌స్టోరీ కాదని నాని చెప్పిన మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా చాలా సింపుల్‌గా, సున్నితంగా, స్వీట్‌గా ఉంటుందని నాని తెలిపారు. అన్ని వయసుల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ కథను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యంగా తనను కలిసేందుకు వచ్చే వారిలో చిన్నారులు ఎక్కువగా ఉంటారని.. వాళ్లు కూడా తన సినిమాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేలా ఉండే కథలో నటించడం తనకు ఆనందంగా ఉందని నాని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, దర్శకుడు, హీరోయిన్, విడుదల తేదీ వంటి వివరాలను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ది పారడైజ్ ఇచ్చిన అనుభవం.. నాని ఫోకస్ మారిందా?

ఇక నాని రీసెంట్ ఫిల్మ్ 'ది పారడైజ్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ.. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్సెడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా కంటెంట్‌పై వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌పై నాని పెద్దగా స్పందించకుండా.. సినిమాకు వచ్చిన వసూళ్లే..(ఇండియా నెట్ రూ.100 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.150 కోట్ల పైనే) అని తన సమాధానమని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా ప్రయాణం నుంచి ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నామని నాని తెలిపారు. ఇకపై ఒక సినిమా మేకింగ్‌కు ఎంత టైమ్ పట్టినా, షూటింగ్ కంటే ప్రి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకే 60 నుంచి 70 శాతం సమయం కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. 

ప్రొడ్యూసర్‌గానూ వరుస ప్రాజెక్టులు..

హీరోగా విభిన్న కథలను ఎంచుకుంటూనే.. నిర్మాతగానూ నాని తన స్పీడ్ పెంచుతున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై పలు ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. మరోవైపు ది పారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాకు కూడా నాని భాగస్వామిగా ఉన్నారు. ఇలా ఒకవైపు యాక్షన్‌తో కూడిన బ్లడీ రోమియో.. మరోవైపు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండే స్వీట్ లవ్‌స్టోరీ.. ఇంకోవైపు ప్రొడక్షన్ బాధ్యతలు.. ఇలా నాని లైనప్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.