RBI వడ్డీ బాదుడు: 50 లక్షల హోంలోన్ పై.. ఇక నుంచి ప్రతినెలా 900 రూపాయలు అదనంగా కట్టాలి..!

RBI వడ్డీ బాదుడు: 50 లక్షల హోంలోన్ పై.. ఇక నుంచి ప్రతినెలా 900 రూపాయలు అదనంగా కట్టాలి..!

అనుకున్నదే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల దారిలోనే రిజర్వు బ్యాంక్ కూడా ముందుకు సాగుతోంది. దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్టోబర్ 7న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది రిజర్వు బ్యాంక్. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ సంక్షోభాలు, యుద్ధాలు, క్రూడ్ రేట్ల పెరుగుదల వంటి అనేక కారణాలతో ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు రిజర్వు బ్యాంక్ ఈ మానిటరీ చర్యలను ప్రారంభించింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి పెరిగింది.

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నందున సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. చూసేందుకు ఇది చిన్న పెరుగుదలగానే కనిపిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలంలో హోమ్ లోన్, కారు లోన్ తీసుకున్న వారిపై ఇది చాలా పెద్ద ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా రెపో రేటుకు లింక్డ్ లోన్లకు ఈ మార్పు నేరుగా వర్తిస్తుంది.

రూ. 50 లక్షల లోన్ పై ప్రభావం:
ఒక వ్యక్తి 25 సంవత్సరాల కాలానికి 7.5% వడ్డీ రేటుతో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని భావిస్తే వారిపై పెరగనున్న వడ్డీ రేట్ల ఎఫెక్ట్ ఎలా ఎంత వరకూ ఉంటుందనేది లెక్కల్లో తెలుసుకుందాం రండి. ఒకవేళ వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు పెంచితే పరిస్థితి ఏంటనేది చూద్దాం..
* వడ్డీ రేట్లు పెరగక మునుపు ప్రస్తుత నెలవారీ EMI: సుమారు రూ.36వేల 950 ఉంటుంది.
* వడ్డీ రేటు పెంపు: ఒకవేళ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగితే... కట్టాల్సిన గడువు మారకుండా ఉండాలంటే మీ ఈఎంఐ సుమారు రూ.817 పెరుగుతుంది.
* కొత్త ఈఎంఐ: దీనితో నెలవారీ చెల్లింపు సుమారు రూ.37వేల 767కు చేరుకుంటుంది.
* వార్షిక వడ్డీ భారం: అంటే ఏడాదికి అదనంగా దాదాపు రూ.9వేల 800 అదనపు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది.
* మొత్తం 25 ఏళ్ల కాలానికి వడ్డీ భారం: ఈ మొత్తం 25 ఏళ్ల కాలపరిమితిపై చూస్తే.. కేవలం ఆ 25 bps పెంపు వల్ల చెల్లించాల్సిన అదనపు వడ్డీ భారం సుమారు రూ.2లక్షల 45వేలుగా మారుతుంది.

1. ఈఎంఐ పెరుగుతుందా? కాలపరిమితి మారుతుందా?
రేట్లు పెరిగిన వెంటనే కొన్ని లెండర్ సంస్థలు ఈఎంఐని పెంచితే.. మరికొన్ని సంస్థలు లోన్ కాలపరిమితిని పొడిగిస్తాయి. మరికొన్నిసార్లు ఈ రెండింటి కలయికను అమలు చేస్తాయి. మీ బ్యాంకు పెరిగిన వడ్డీ రేట్లను ఎలా అడ్జెస్ట్ చేస్తుందో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.

2. భారాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు:
* రేట్లు పెరిగినప్పుడు రుణ కాలపరిమితి పెరగకుండా.. మీరే స్వచ్ఛందంగా ఈఎంఐ మొత్తాన్ని పెంచడం ద్వారా లాంగ్ టర్మ్ లో వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
* వార్షిక బోనస్‌లు, ఇతర అదనపు ఆదాయం వచ్చినప్పుడు కొంత మెుత్తాన్ని లోన్ ముందస్తు చెల్లింపులు చేయడం ద్వారా అసలు మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల మిగిలిన కాలంలో పడే వడ్డీ భారం తగ్గుతుంది.