హైదరాబాద్: దసరా పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న రెండు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 7) డీఏల విడుదలకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
2024 జనవరి, జులై నెలల డీఏలు (6.27%) విడుదల చేసినట్లు జీవోలో పేర్కొంది. అక్టోబర్ జీతంతో పెంచిన డీఏ నవంబర్ 1న చెల్లించనుంది. డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనుంది. యూజీసీ, ఏఐసీటీఈ ఉద్యోగులకూ ఈ డీఏ వర్తించనుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఆరు డీఏలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో రెండు డీఏల విడుదలకు ఇటీవల జరిగిన భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం రెండు పెండింగ్ డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ వేళ ప్రభుత్వం పెండింగ్ డీఏలను విడుదల చేయడంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
