హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలిగిస్తున్నారని ఆరోపణలు రావడంతో బీజేపీ నాయకుడు , బిఎల్ఏ భాలుచందర్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం ఎలాక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.
బాగ్ లింగంపల్లి బూత్ నంబర్ 210లో సర్ ప్రక్రియలో భాగంగా బీజేపీ బూత్ ఏజెంట్ బాలుచందర్ ఫారమ్ 7 సమర్పించి ఓ వర్గానికి చెందిన 31 మంది ఓట్లను తొలగించాలని బీఎల్ఓను బలవంతం చేశాడని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనను ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడానికి కుట్ర చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారి ఫిర్యాదు మేరకు బిఎల్ఏ భాలుచందర్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
