Kiara Advani: మరోసారి తల్లి కాబోతున్న బ్యూటీ కియారా.. సెకండ్ ప్రెగ్నెన్సీపై స్వీట్ అనౌన్స్‌మెంట్

Kiara Advani: మరోసారి తల్లి కాబోతున్న బ్యూటీ కియారా.. సెకండ్ ప్రెగ్నెన్సీపై స్వీట్ అనౌన్స్‌మెంట్

బాలీవుడ్ బ్యూటీ, ‘టాక్సిక్’ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి తల్లి కాబోతున్నారు. భర్త, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తమ రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నట్లు కియారా స్వీట్‌గా అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో బేబీ సాక్స్ ఫొటోను షేర్ చేస్తూ.. “మరోసారి అన్నింటికంటే గొప్ప బహుమతిని పొందాం.. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి” అంటూ గుడ్ న్యూస్ పంచుకున్నారు. దీంతో కియారా–సిద్ధార్థ్ దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరోసారి ‘గ్రేటెస్ట్ గిఫ్ట్’..

ఈ సందర్భంగా తమ రెండో బిడ్డ రాకను కియారా ఎంతో అందంగా వెల్లడించారు. తమ కుమార్తె సరాయా చేతిలో ఓ చిన్న తెల్లటి బేబీ సాక్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో పాప చేతిని సిద్ధార్థ్, కియారా పట్టుకుని ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోతో పాటు.. “మరోసారి అన్నింటికంటే గొప్ప బహుమతిని పొందాం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి” అంటూ కియారా ఈ గుడ్ న్యూస్ పంచుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

కియారా, సిద్ధార్థ్ దంపతులకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2025 జూలైలో వీరిద్దరూ తమ తొలి సంతానంగా పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో ఈ స్టార్ కపుల్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.

శేర‍్షా మూవీతో మొదలైన ప్రేమ..

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమకథ విషయానికొస్తే.. వీరిద్దరి పరిచయం ‘శేర్షా’ సినిమా సమయంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. 2021లో విడుదలైన ఈ వార్ డ్రామాలో సిద్ధార్థ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో నటించగా.. కియారా ఆయన ప్రేయసి డింపుల్ చీమాగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు బాలీవుడ్‌లో అప్పట్లో వార్తలు వచ్చాయి.

కొంతకాలం తమ ప్రేమను గోప్యంగా ఉంచిన ఈ జంట.. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న సూర్యగఢ్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గానే ఉంచుతూ వస్తున్నారు.

తల్లయ్యాక పూర్తిగా మారిపోయానన్న కియారా..

మాతృత్వం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని కియారా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తల్లి కాకముందు ఉన్న వ్యక్తికి, ఇప్పుడు ఉన్న తనకు చాలా తేడా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తల్లయ్యాక తాను మరింత ధైర్యంగా, బలంగా మారానని, “టైగ్రెస్”లా ఫీల్ అవుతున్నానని కూడా కియారా పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం కియారా సినిమాల పరంగా కూడా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలే ‘Toxic’ సినిమాతో అలరించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)