DMHOలో మెడికల్ స్టాఫ్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ! ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు.. అప్లయ్ చేసుకోండి!

 DMHOలో మెడికల్ స్టాఫ్,  నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ! ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు..  అప్లయ్  చేసుకోండి!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీఎం & హెచ్ఓ) పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్​హెచ్ఎం) ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

మొత్తం పోస్టులు: 33. 

విభాగాల వారీగా ఖాళీలు: ఎంఎల్​హెచ్​పీ/ సీహెచ్ఓ/ ఎంఓ పల్లె దవాఖాన 12, పీడియాట్రిషియన్/ మెడికల్ ఆఫీసర్స్ 1, ఫిజీషియన్స్– ఎంబీబీఎస్/ ఎండీ 1, స్టాఫ్ నర్స్ 9, లాబ్ – టెక్నీషియన్ 5, ఎస్​టీఎల్ఎస్ 1, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ 1, 2వ ఏఎన్ఎం 3. 

విద్యార్హతలు: పోస్టులను అనుసరించి ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎండీ పీడియాట్రిక్స్, ఎండీ జనరల్ మెడిసిన్, ఎంఎల్​టీ, డీఎంఎల్​టీ, ఎంఎస్సీ డిసేబిలిటీ స్టడీస్, ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​లకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్​లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 3.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలు రూ.500, ఎస్సీ, ఎస్టీలు రూ.300 చెల్లించాలి.

లాస్ట్ డేట్: అక్టోబర్ 13.

సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు (90 శాతం వెయిటేజీ), వయో పరిమితికి (10 శాతం వెయిటేజీ) ఆధారంగా ఎంపిక చేస్తారు.  

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ bhoopalapally.telangana.gov.inను సందర్శించండి.