ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణంలోనే బెడ్ రూంకు ఏదిశలో బాత్రూం ఉండాలనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే ప్రస్తుతం చాలామంది ఇళ్లల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకుంటారు .. వాస్తు ప్రకారం ప్లాంట్ ఎక్కడ ఉండాలి...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న : బెడ్రూము బాల్కనీ ఏవైపు ఏర్పాటు చేసుకుంటే మంచిది?
జవాబు: ఇల్లు ఫేసింగ్, బెడ్రూమ్ ఫేసింగ్ ఏవైపు ఉంటుంది అనేదాన్నిబట్టి నిర్ణయించాలి. అయితే తూర్పు, ఉత్తరం దిక్కుల్లో బాల్కనీ ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రశ్న : ఇంటికి దక్షిణంవైపు గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. వాస్తు ప్రకారం ఇది సరైనదేనా?
జవాబు: గోబర్ గ్యాస్ ప్లాంట్ భూమిపైన ఏర్పాటు చేస్తున్నారా లేదా భూమి లోపల ఏర్పాటు చేస్తున్నారా అనేది చూడాలి. భూమిలోపల అయితే దక్షిణంవైపు గుంట ఉండకూడదు. అందువల్ల దక్షిణ దిక్కు కాకుండా, వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు.
►ALSO READ | తీపి పదార్థాల వల్ల మాత్రమే కాదు.. ఈ అలవాట్ల వల్ల కూడా 'షుగర్' వచ్చే ఛాన్స్ ఉంది!
