హైదరాబాద్ హైటెక్స్లో హిమ్టెక్స్ ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్ హైటెక్స్లో హిమ్టెక్స్ ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఇంటర్నేషనల్​ మెషీన్ టూల్ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్​ ‘హిమ్​టెక్స్​2026’ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం ప్రారంభమైంది. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకను ఏస్ అర్బన్ గ్రూప్  డైరెక్టర్ స్వాతి, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ అదనపు డైరెక్టర్ రాజేష్ ప్రారంభించారు.

మానుఫ్యాక్చరింగ్​, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన సుమారు 300 సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఆటోమేషన్, డిజిటలైజేషన్, అధునాతన ఇంజినీరింగ్ టెక్నాలజీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ యంత్రాలు, మ్యాచినింగ్ సెంటర్లు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషీన్లు, హైడ్రాలిక్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇండస్ట్రియల్ రోబోలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, నాలెడ్జ్ షేరింగ్​ ద్వారా కంపెనీలు ఆధునిక తయారీ విధానాలకు మారడానికి హిమ్​టెక్స్ ​ ఉపయోగపడనుంది.