లారీని ఢీకొట్టిన బైక్, తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు.. సిద్దిపేట జిల్లా ధర్మారం వద్ద ప్రమాదం

లారీని ఢీకొట్టిన బైక్, తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు.. సిద్దిపేట జిల్లా ధర్మారం వద్ద ప్రమాదం

తొగుట, వెలుగు : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో తల్లీకొడుకులు చనిపోయారు. ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం కూడలి వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... అక్బర్ పేట -భూంపల్లి మండలం మోతె గ్రామానికి చెందిన పోషి ఎల్లం (35) కొడుకు రిషిక్ అనారోగ్యానికి గురికావడంతో సిద్దిపేటలో హాస్పిటల్ లో చూపించేందుకు తల్లి భూమవ్వ (55)తో కలిసి బైక్ పై బయలుదేరాడు. 

ధర్మారం కూడలి వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో ఎల్లం, భూమవ్వ అక్కడికక్కడే చనిపోగా రిషిక్ స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మిరుదొడ్డి ఎస్సై సతీశ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.