హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని సోమవారం (అక్టోబర్ 5) సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆయన పేరు తెర మీదకు రావడంతో నోటీసులు ఇచ్చి సాక్షిగా అధికారులు కోదండిరెడ్డిని ఇన్వెస్టిగేట్ చేశారు. దాదాపు 40 నిమిషాలకు అధికారులు ఆయనను విచారించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా పలువురు ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జడ్జిలు, సెలబ్రెటీల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ALSO READ : సచివాలయానికి నీళ్లు బంద్ ప్రచారంపై..
విచారణలో భాగంగా పలువురిని విచారించిన సిట్ తుది చార్జిషీట్ సిద్ధం చేశారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వంటి సీనియర్ పోలీసు అధికారులను గతంలోనే అరెస్ట్ చేశారు. తదనంతరం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు.
