వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావడం పక్కా అంటూ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటనతో రిలీజ్‌పై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు అదే రిలీజ్ డేట్‌పై మరోసారి సస్పెన్స్ మొదలైంది. AK 47 సినిమా అక్టోబర్ 30కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో టాక్ ఊపందుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగవంశీ క్లారిటీ.. మళ్లీ ఎందుకీ కన్ఫ్యూజన్?
కొద్దిరోజులుగా ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ స్వయంగా స్పందించారు. అక్టోబర్ 9న సినిమా విడుదలలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దీంతో ఈసారి డేట్ ఫిక్స్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజులు గడవకముందే మళ్లీ వాయిదా టాక్ తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ట్రైలర్, బుకింగ్స్‌పై కూడా ప్లాన్ రెడీ!
అక్టోబర్ 6న ట్రైలర్‌ను రిలీజ్ చేయడం, అక్టోబర్ 7 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం వంటి ప్లాన్స్‌ను టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు.. ప్రీమియర్స్ లేకుండా అక్టోబర్ 9న నేరుగా థియేటర్లలో సినిమాను తీసుకొస్తామని కూడా నిర్మాత తెలిపారు. దీంతో ప్రమోషన్స్ విషయంలో టీమ్ ఫుల్ క్లారిటీలోనే ఉందని అనిపించింది.
Ma release punctuality meeda meeku doubt undachu, kani eesari alanti doubts em oddu 😄 #AdarshaKutumbam #AK47OnOCT9th We are coming on 9th October. There is no change in that ❤️ 6th – Trailer Launch 7th – Advance Bookings Open across both Telugu states Families andaru mee pillalatho exams baaga rayinchi, holidays ki baga suit ayye ma chakkani comedy action family film tho start cheyandi… happy ga navvukuntu enjoy cheyyadaniki please come to the theatres ❤️ 9th October ki direct ga theatres lo kaluddam, no premieres💥🤗
— Naga Vamsi (@vamsi84) October 1, 2026
అసలు వాయిదా టాక్ ఎందుకు?
ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కంప్లీట్ కాలేదట. ఫైనల్ వర్క్ విషయంలో ఎలాంటి హడావుడి చేయకుండా, ఔట్‌పుట్‌ను మరింత పర్ఫెక్ట్‌గా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. అందుకే రిలీజ్‌ను మరోసారి రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అక్టోబర్ 16 కాదు.. 30పై ఫోకస్?
వాయిదా పడితే అక్టోబర్ 16న సినిమాను తీసుకొచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ డేట్‌కు ఇప్పటికే ‘జైలర్ 2’, ‘రానా బాలి’ వంటి సినిమాలు లైన్‌లో ఉన్నాయి. దీంతో థియేట్రికల్ క్లాష్‌ను తప్పించుకుని అక్టోబర్ 30కి వెళ్లడమే బెటర్ అనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నిసార్లు మారుతుంది రిలీజ్ డేట్?
‘ఆదర్శ కుటుంబం’ విషయంలో రిలీజ్ డేట్ మారడం ఇదే మొదటిసారి కాదు. తొలుత సమ్మర్ రిలీజ్ అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 2 అని ప్రకటించారు. అనంతరం అక్టోబర్ 9కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి డేట్ మారే వార్తలు రావడంతో ఫ్యాన్స్‌లో సహజంగానే అసహనం కనిపిస్తోంది.
అయితే ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న ఇండస్ట్రీ బజ్ మాత్రమే. అక్టోబర్ 30 డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి నాగవంశీ చెప్పినట్టే అక్టోబర్ 9న ‘ఆదర్శ కుటుంబం’ థియేటర్లలోకి వస్తుందా? లేక మరోసారి డేట్ మారుతుందా? అనేది త్వరలోనే తేలనుంది.
