ప్రతి వ్యక్తికి కోరికలు ఉంటాయి. వాటికోసం నిత్యం పరితపిస్తుంటాం.. పూజలు.. పునస్కారాలు వ్రతాలు.. ఇలా అనేకమైనవి చేస్తుంటాయి. అవి తీరాలంటే దైవానుగ్రహం తప్పనిసరని పండితులు చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీరాలన్నా.. అనుకున్నవి నెరవేరాలన్నా ఏ పూజ చేయాలి. ఎప్పుడు చేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
కోరిక ఏదైనా.. ఇచ్చే దైవం ఎవరైనా.. అంతిమంగా దా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం.. తృప్తి మాత్రమే. ఈ విధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని అందించేది శ్రీ వరలక్ష్మీదేవని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది.
స్కాంద పురాణం ప్రకారం పరమేశ్వరుడే పార్వతికి వరలక్ష్మీ దేవి గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్నీ వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది.
వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత వరలక్ష్మీదేవి. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు ... శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవి అవతరించిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
శ్రీ లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా పూజించిన మహా పతివ్రత అయిన చారుమతి పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది.శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కాని.. ఏదేని శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరిసంపదల్ని వ్రత ప్రసాదంగా అందుకుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
శ్రావణమాసంలో శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా జీవితకాలం ఉండాలని కోరుకుంటా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. లక్ష్మీ నివాస స్థానాలు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...
పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్తాల్రు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన, పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి.
యః శుచిః ప్రయతో భూత్వా!
జుహుయాదాజ్యమన్వహం శ్రియః!
పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్!!
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని ఈ మంత్రానికి భావం. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. పంచభూతాలకు ప్రతీక వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి.
ఇంటి పనులూ వంటపనులూ పశుపోషణా .... పొలం పనులూ ధాన్యమును సేకరించటానికి కావలసిన అన్ని జ్ఞానాలూ కార్యాలూ సంస్కరణాది ప్రకృతి సేవలను భగవత్ కైంకర్యాలుగా చేసే తత్వం ఆమె సొంతం.అలాంటి మనసు కలిగిన చారుమతి... పాల సముద్రమనే ప్రశాంత కడలిలో పవళించిన శ్రీమహా విష్ణువు యొక్క హృదయేశ్వరి అయిన వరాలను ఇవ్వగలిగిన శక్తి గల శ్రీ వరలక్ష్మీదేవితో అను సంధానమైనదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
