కాంస్య విగ్రహం కాదు..చిత్తశుద్ధి ఉంటే.. మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టాలి : నాగెల్లి వెంకటనారాయణ గౌడ్

కాంస్య విగ్రహం కాదు..చిత్తశుద్ధి ఉంటే.. మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టాలి : నాగెల్లి వెంకటనారాయణ గౌడ్

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్​కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్‌‌‌‌రెడ్డి విగ్రహాన్ని ఎవరు తొలగించారో నియోజకవర్గ ప్రజలందరికి తెలుసని, కాంగ్రెస్ లీడర్లకు చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టాలని బీఆర్ఎస్​ నర్సంపేట టౌన్​ప్రెసిడెంట్‌‌‌‌ నాగెల్లి వెంకటనారాయణగౌడ్​ అన్నారు. నర్సంపేటలో గురువారం మీడియాతో మాట్లాడుతూ విగ్రహ తొలగింపులో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

ఈ విషయంలో ఆ పార్టీకి సంబంధం లేకపోతే 5వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త పొన్నాల ప్రకాశ్‌‌‌‌..  పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని కమిషనర్‌‌‌‌‌‌‌‌కు ఎందుకు ఫిర్యాదు చేశాడని ప్రశ్నించారు. అధికారులు, పోలీసులను ముందు పెట్టుకొని చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు మండల శ్రీదేవి, రాయిడి కీర్తి, శివరాత్రి స్వామి, దొమ్మాటి రమ్మ సంబతోష్​, నాయకులు పాల్గొన్నారు.