హైదరాబాద్ లో గైడ్హౌస్ టెక్ హబ్

హైదరాబాద్ లో గైడ్హౌస్  టెక్  హబ్

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సేవలు అందించేందుకు రాబోయే 12 నెలల్లో మేనేజ్డ్ సర్వీసెస్, టెక్నాలజీ, అనలిటిక్స్, డిజిటల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మేషన్ రంగాలకు చెందిన వెయ్యి మందికి పైగా నిపుణులను నియమించుకోనుంది.  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బలమైన విద్యా వ్యవస్థ, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత తమ దీర్ఘకాలిక వృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్ ​అలీ బొఖారీ తెలిపారు.