భద్రాద్రికొత్తగూడెం: వైద్యాధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ అంకిత్‌‌‌‌ ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం: వైద్యాధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ అంకిత్‌‌‌‌ ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: మీ ఇంట్లో ఏదైనా పరికరం పనిచేయకపోతే ఇలాగే వదిలేస్తారా అని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అంకిత్‌‌‌‌ వైద్యాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలో గురువారం కలెక్టర్​ పర్యటించారు. ఈ సందర్భంగా పట్వారిగూడెం పీహెచ్‌‌‌‌సీలో ఏడాదిగా పనిచేయని అనాలసిస్​ మిషన్‌‌‌‌ను బాగు చేయకపోవడంపై మండిపడ్డారు. జిల్లాలోని హాస్పిటళ్లలోని పనిచేయని మిషన్లను పరిశీలించి వాటి రిపేర్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

అనంతరం మండలంలోని గండుగులపల్లి గ్రామంలో చేపడ్తున్న సోలార్​పనులను పరిశీలించారు. గండుగులపల్లి గ్రామాన్ని మోడల్​ సోలార్​ విలేజ్​గా రూపొందిస్తున్నామన్నారు. అనంతరం మదనపల్లి గ్రామంలోని సోషల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ బాయ్స్‌‌‌‌ గురుకులాన్ని సందర్శించారు. డిజిటల్​ క్లాస్​రూం, డైనింగ్​హాల్, తరగతి గదులు అపరిశుభ్రతగా ఉండడంపై మండిపడ్డారు. మెనూ అమలు కాకపోవడంపై హెచ్​ఎం, వార్డెన్లకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.