జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశిలో గురుడు.. కుజుడు కలిసి సంచారం చేసే సమయంలో గురు మంగళయోగం ఏర్పడుతుంది. ఈ నెల మొత్తం ( అక్టోబర్ 2026) కర్కాటక రాశిలో గురు గ్రహం ఉచ్ఛస్థితిలో, కుజ గ్రహం నీచస్థితిలో ఉంటాయి. ఈ ప్రభావం వలన నీచభంగ రాజయోగంతో పాటు.. గురుమంగళయోగం ఏర్పడటంతో నాలుగు రాశుల (మేష, కర్కాటక,వృశ్చిక, ధనస్సు) వారికి కష్టాలు తొలగి.. అదృష్టం వరిస్తుందని పండి తులు చెబుతున్నారు. ఆరాసుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మేష రాశి : ఈ రాశికి అధిపతి కుజుడు.. కర్కాటక రాశిలో గురుడు.. కుజుడు కలిసి సంచారం వలన ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. గురు, కుజ గ్రహాల కలయిక మీ ధైర్యాన్ని, శౌర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. భూమి, భవనాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తుల కొత్త పెట్టుబడులు మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: ఇదే రాశిలో గురు మంగళయోగం ఏర్పడుతుంది. గురుడు.. కుజుడు కలిసి సంచారం చేయడం వలన ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఆగిపోయిన పనుల్లో స్పీడ్ పెరుగుతుదంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఒక్కసారిగా... అనుకోకుండా లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య విబేధాలు తొలగి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. .
►ALSO READ | ఎండ తగలడం లేదా ? విటమిన్-డి తగ్గిందో ఇక అంతే.. ఈ ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం!
వృశ్చిక రాశి: కర్కాటక రాశిలో కుజుడు, గురుడు కలవడం వలన రాజ యోగాలు, ధన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో... గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి : గురు మంగళయోగం వలన ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో మీరే చక్రం తిప్పే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారికి బంధువర్గంలోని వారితో కుదిరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
